Monday, December 9, 2024

సమస్యలపై రోడ్డెక్కిన జర్నలిస్టులు..

అనంతపురం కార్పొరేషన్ – జర్నలిస్టులందరికీ అక్రిడిటేసన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలివ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్న డిమాండ్ పై జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఎపిడబ్లుజెఎఫ్, ఎపిబిజెఎలు సంయుక్తంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు. డి.పి.ఆర్.వో కార్యాలయం వద్ద గురువారం నాడు బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి ఏపీ స్ట్రింగర్స్ యూనియన్ నాయకులు కూడా మద్దతు తెలిపారు. జర్నలిస్టులకు మూడు నెలలు అవుతున్నా అక్రిడిటేషన్లు ఇవ్వలేదని ఎపిడబ్లుజెఎఫ్ అధ్యక్షుడు మండిపడ్డారు. అదే రకంగా ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలను నిలిపివేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిడబ్లుజెఎఫ్ కార్యదర్శి రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేసన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలివ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం అనంతరం డి.పి.ఆర్.వో జయమ్మకు వినతి పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement