Tuesday, May 14, 2024

భిక్షాటన చేసి ఉన్నత విద్యనభ్యసించిన ఏఎస్పీ హనుమంతు

ఇది కథ కాదు. బిక్షాటన చేసి చదువుకున్న ASP (AR) అనంతపురం. అవును తల్లి, కొడుకు ఇద్దరూ ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేసిన రోజులవి. నిన్న డిస్కవర్ అనంతపురం, AGS foundation వారు నిర్వహించిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు పుస్తకాలు, డిజిటల్ slates పంపిణీ కార్యక్రమంలో అనంతపురం ASP హనుమంతు సుమారు 400 మంది పిల్లలతో పంచుకున్న జీవన పోరాటం అందరి కళ్ళలో ఒక్కసారిగా నీళ్ళు తిరిగాయి.

ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తాను బిక్షాటన చేసే వాడినని వందల మంది ముందు చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలి ? ఆ దైర్యం వెనకాలా ఓ పది మంది పిల్లలు మారాలి ఆన్న ఆలోచన ఎంత గొప్పది.. ఆయన ఏమన్నారో మీరే చూడండి. శోకం నిండిన జీవితాన్ని ఎలా స్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనేదానికి హనుమంతు ఓ నిలువెత్తు నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement