Thursday, May 2, 2024

AP: పుట్టపర్తి చేరుకున్న సీఎం జగన్

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 7 (ప్రభ న్యూస్) : పుట్టపర్తిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా నిధులను విడుదల చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

సీఎంకు ఘనస్వాగతం పలికిన వారితో శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, హిందూపురం ఎంపీ మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ సి హెచ్ చేతన్, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి కదిరి డా.ఎమ్మెల్యే డా.సిద్ధారెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్, అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడ చేర్మెన్ మహాలక్ష్మి శ్రీనివాస్, పుడా చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్.జె.రత్నాకర్, ఏయీర్ పోర్ట్ ఇంఛార్జి సాయినాథ్, నాయకులు పైలా నర్సింహాయ్య, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఆర్డీవో భాగ్యరేఖ తదితరులు ముఖ్యమంత్రి పుష్పగుచ్చాలను అందించి ఆత్మీయ సత్కారం చేసి ఘనంగా స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి 10:28 నిమిషాలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ద్వారా బహిరంగ సభావేదికకు ముఖ్యమంత్రి ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి వచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement