Friday, April 26, 2024

Big Breaking | 850 మంది వ్యభిచారంలోకి.. హ్యుమ‌న్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు..

ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాని పోలీసులు ప‌ట్టుకున్నారు.  ఈ ముఠాకి చెందిన ఏడుగురుని అరెస్టు చేశారు. ఆన్​లైన్​ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. కాగా, ఈ ముఠా ముంబై, బెంగాల్​, ఆంధ్రప్రదేశ్​కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో 850 మంది యువతులను గ్యాంగ్​ వ్యభిచారం రొంపిలోకి లాగినట్టు సమాచారం అందుతోంది. అందమైన యువతుల ఫొటోలను ఆన్​లైన్​ పెట్టి విటులను ఆకర్షించడం.. ఆ తర్వాత వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వాట్సాప్​ లొకేషన్​ ద్వారా యువతలను చేరవేస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement