Sunday, April 28, 2024

ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు

అమరావతి,ఆంధ్రప్రభ: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా సెక్షన్‌ 12(1)సి ప్రకారం అన్ని ప్రయివేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాల ల్లో 25 శాతం సీట్లను పేద పిల్లలకు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలు దూరంగా ఉండడం వలనో, లేదా ప్రయివేట్‌ పాఠశాలలో చదువు బాగా చెప్తారని తాము భావించిన ప్రయివేట్‌ పాఠశాలలో తమ పిల్లలకు చేర్పించేందుకు ఇదోక మంచి అవకాశం. చట్టం వచ్చి దాదాపు పదేళ్లు దాటి పోయినా ఈ నిబంధనను పూర్తి స్థాయిలో ఇప్పుడే అమలకు పూనుకోవడం విశేషం.

- Advertisement -

ఏఏ వర్గం వారికి ఎంత శాతం సీట్లు అంటే..?

పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన పిల్లల కు అంటే అనాధలు, హెచ్‌ఐవి బాధితులు, దివ్యాంగులకు ఐదు శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనారీటీ, ఓసిలకు చెందిన పిల్లలకు ఆరు శాతం సీట్లను కేటాయించారు. ఈ సీట్ల కింద స్కూళ్లలో అడ్మిషన్‌ పొందాలంటే గ్రామీణ ప్రాంతాలలోనైతే పిల్లల తల్లితండ్రుల సంవత్సర ఆదాయం లక్షా 20వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో నైతే లక్షా 44 వేల రూపాయల లోపు ఉండాలి. ఈ విద్యార్దులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు గాను పాఠశాల విద్యా శాఖ పోర్టల్‌ నుందు ఈనెల ఆరో తేదీ నుండి 16వ తేదీ లోపు అన్ని ప్రయివేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు నమోదు చేసుకోవాలి. విద్యార్ధులు తమ సీట్ల కోసం ఈనెల 18వ తేదీ నుండి వచ్చే నెల ఏడో తేదీలోపు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వచ్చే నెల 13వ తేదీన అర్హత సాధించిన విద్యార్ధుల మొదటి జాబితాను విడుదల చేస్తారు. రెండో జాబితాను వచ్చే నెల 25వ తేదీన విడుదల చేస్తారు. విద్యార్ధుల ఎంపికను లాటరీ పద్దతిని అనుసరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement