Wednesday, May 8, 2024

2.14 కోట్ల విలువైన అక్రమ మద్యం.. అయ్యయ్యో రోడ్డు రోలర్​తో తొక్కించేశారే!

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో: ప్రకాశం జిల్లాలో గత కొంత కాలంగా అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన రూ.2.14 కోట్ల విలువ చేసే మద్యం బాటిళ్లను బుధవారం జిల్లా ఎస్పీ మలిక గర్‌ సమక్షంలో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్‌ఈబీ పోలీసులు ముమ్మరంగా దాడులు, తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు సంబంధించి మద్యంను పట్టుకున్నారు.

జిల్లాలోని ఎస్‌ఈబీ పోలీసు స్టేషన్లలో 904 కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, డ్యూటీ ఫైడ్‌ లిక్కర్‌ విత్‌ అవుట్‌ హీల్స్‌..వివిధ బ్రాండ్లకు చెందిన రూ. 2.14 కోట్ల విలువ చేసే 42,810 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం నిర్మూలనకు గత రెండు నెలల నుండి పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సుమారు 200లకు పైగా కేసులు నమోదు చేసి, 200 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సమర్ధవంతంగా పని చేసి అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరికడతామన్నారు. జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement