Saturday, May 4, 2024

AP: వెయ్యి లీటర్ల నాటుసారా సీజ్… ముగ్గురు అరెస్ట్

సోంపేట /మందస, అక్టోబర్ 16 (ప్రభ న్యూస్) : మందస పట్టణానికి చెందిన గార.పాపారావు నాటుసారా వ్యాపారం చేస్తూ ముగ్గురు వ్యక్తులతో తన బలోరో వాహనంలో 1000 లీటర్ల నాటు సారా తెప్పిస్తుండగా.. మందస ఎస్సై ఐ.హరికృష్ణ పట్టుకొని బొలెరో వాహనంతో పాటుగా ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ శారు. అలాగే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మందస పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం మందస పట్టణానికి చెందిన గార పాపారావు తన వాహనంలో బొందికారి గ్రామానికి చెందిన సవర గోపి, సవర బలరాం కృష్ణల ద్వారా కిల్లం వీదికి చెందిన తెలుకుల గణేష్ అనే డ్రైవర్ తో 1000 లీటర్ల నాటుసారా బొలోరో వాహనంలో తెప్పిస్తుండగా మందస ఎస్సై హరికృష్ణ మందస మండలం చిన్నకోస్టా బీటీ రోడ్డు సమీపంలో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిలను రిమాండ్ కు తరలించినట్లు మందస పోలీసులు తెలిపారు. సంబంధిత సారా వ్యాపారి గార పాపారావు పరారీలో ఉన్నట్లు మందస ఎస్సై హరికృష్ణ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement