Tuesday, May 14, 2024

Big Breaking | కొత్త అంశాలు, ఎన్నో హామీలు.. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ మాట్లాడుతూ..  గతంలో మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు. ఎన్నిలక ప్రణాళికలో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని..  భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.

కేసీఆర్​ బీమా.. ప్రతి ఇంటికి ధీమా

కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని కేసీఆర్​ అన్నారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల సాధారణ బీమా అందిస్తామని తెలిపారు. రైతు బీమా తరహాలోనే దీనిని అమలు చేస్తామని చెప్పారు. సాధారణ మరణానికి కూడా బీమా వర్తింస్తుందని అన్నారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మరోసారి అధికారంలో వచ్చిన నాలుగైదు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని అన్నారు.

తెలంగాణ అన్నపూర్ణ పథకం..

తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్​ అన్నారు. తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు దీనిని వర్తింపచేయనున్నట్టుగా హామీ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వచ్చే ఏప్రిల్- మే నుంచి దీనిని అమలు చేస్తామని చెప్పారు.

- Advertisement -

పింఛన్​ పెంచేందుకు హామీ..

తెలంగాణ‌లో సామాజిక పెన్షన్లు రూ. 5 వేలకు పెంచనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ. 3 వేలకు పెంచి.. ప్రతి ఏడాది 500 రూపాయలు పెంచుతూ.. ఐదో సంవత్సరం వరకు రూ. 5వేలకు చేరుకుంటుందని అన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసాని భారం పడే అవకాశం ఉండదని అన్నారు. దివ్యాంగులకు పెన్షన్‌ను ఇటీవల రూ. 4 వేలకు పెంచామని.. దానిని రూ. 6 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే మార్చి తర్వాత రూ. 5 వేలకు పెంచి.. ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు.   

బి.ఆర్.ఎస్. 2023 మేనిఫెస్టో

  • కౌలు రైతులకు ఆర్థిక సహాయం.
  • రైతు బందు… 16000
  • మొదటి ఏడాది 12000
  • వ్యవసాయ స్థిరీకరణ కొనసాగింపు
  • మహిళలకు 3000
  • అర్హులైన పేద మహిళలకు గౌరవ భృతి… సౌభాగ్య లక్ష్మి
  • గ్యాస్ సిలిండర్ … 400
  • జర్నలిస్ట్ లకు కూడా అమలు
  • ఆరోగ్య శ్రీ… 15 లక్షలకు పెంపు
  • జర్నలిస్ట్ లకు కూడా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో అమలుకు ప్లాన్
  • కెసిఆర్ ఆరోగ్య రక్ష్య
  • లక్ష డబల్ బెడ్ రూమ్ లు హైదరాబాద్ లో
  • అగ్రవర్ణ పేదలకు 119 రెసిడెన్సీ పాఠశాలలు
  • స్వశక్తి మహిళా గ్రూప్ లు… సొంత భవనాలు
  • అసైన్డ్ ల్యాండ్.. ఆక్షలు తొలగిస్తాం Ops డిమాండ్ మీద కమిటీ
Advertisement

తాజా వార్తలు

Advertisement