Saturday, May 4, 2024

ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతం – వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా

బెంగళూర్‌ : అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల అర్ధిక వ్యవస్థలు ఈ సంవత్సరం, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచ వృద్ధిలో 80 శాతం వాటా కలిగి ఉటాయని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇందులో ఒక్క ఇండియా వాటానే 15 శాతం ఉంటుందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా బుధవారం నాడు తెలిపారు. భారత్‌ బలమైన ఆర్ధిక పనితీరును ప్రకాశవంతమైన ప్రదేశంగా జార్జివా అభివర్ణించారు. ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గానే కాకుండా, దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్‌కు ప్రత్యేనకమైన స్థానం ఉందన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అనిశ్చితులు పెరిగిన సమయంలో భారత్‌ బలమైన పనితీరు ఒక ప్రకాశంతమైన ప్రదేశంగా ఉందన్నారు. ఈ సమయంలో 20 మంది ఆర్ధిక మంత్రుల గ్రూప్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల బృందం ఈ వారం బెంగళూర్‌లో సమావేశం కావడం సముచితమని ఆమె వ్యాఖ్యానించారు.


బెంగళూర్‌లో జీ20 సమావేశం
బెంగళూర్‌లో ఇండియా జీ20 ప్రెసిడెన్సీ అధ్వర్యంలో ఫైనాన్స్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ డిప్యూటీల సమావేశం బుధవారం నాడు ప్రారంభమైంది. జీ20 దేశాలకు చెందిన ఆర్ధిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతులు శుక్రవారం సమావేశంలో పాల్గొంటారు. బెంగళూర్‌లోని నందిహిల్స్‌ సమ్మర్‌ రిట్రీట్‌లో ఈ సమావేశం జరుగుతున్నది. ఇందులో ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ నెల 24, 25 తేదీల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ల అధ్యక్షతన జరగనున్న జీ20 ఎఫ్‌ఎంసీబీజీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. రుణ పునర్‌నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లెెందుకు ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌, ఇండియా అధ్యక్షతన జరిగే జీ20 సమావేశం కొత్త గ్లోబల్‌ సావరిన్‌ డెట్‌ రౌండ్‌ టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
ఇది మరో సవాల్‌తో కూడిన సంవత్సరం అయినప్పటికీ, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వృద్ధి సూచికలు పెరుగుతుండం మంచి సూచనని ఐఎంఎఫ్‌ తెలిపింది. వాస్తవానికి ఐఎంఎఫ్‌ తాజా అంచనాల ప్రకారం గ్లోబల్‌ వృద్ధి రేటు 2.9 శాతానికి తగ్గుముఖం పట్టినప్పటికీ, 2024లో 3.1 శాతానికి చేరుతుందని

అంచనా వేస్తున్నట్లు జార్జివా చెప్పారు. ఇండియా అధ్యక్షతన జరిగే జీ20 ఆర్ధిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతుల సమావేశం కొన్ని కీలక ప్రపంచ ఆర్ధిక సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రపంచ వృద్ధిలో అభివృద్ధి చెందిన దేశాల వాటా క్రమంగా తగ్గతూ వస్తోంది. పురోగమనంలో ఉన్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా క్రమంగా పెరుగుతోంది. 2021లో అభివృద్ధి చెందిన దెశాల వాటా37 శాతం ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా 63 శాతంగా ఉంది. 2023 నాటికి అభివృద్ధి చెందిన దేశాల వాటా 18 శాతానికి పరిమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎమర్జింగ్‌ మార్కెట్ల వాటా 82 శాతంగా ఉంది. 2024లో
ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల వాటా 19 శాతంగా ఉండనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎమర్జింగ్‌ మార్కెట్ల వాటా 81 శాతంగా ఉండనుంది.
ఈ వారం బెంగళూర్‌లో తాము వ్యక్తిగతంగా కలుస్తామని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ రుణదాతలు, రుణగ్రహిత దేశాలు కలిసి పని చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్లిస్టాలినా జార్జివా చెప్పారు.
20 సంవత్సరాల తరువాత జీ 20 ఆర్ధిక సదస్సుకు భారత్‌ అధ్వర్యంలో జరగనుంది. మన దేశానికి తన ఆర్ధిక శక్తిని, అభివృద్ధి చెందుతునన్న దేశాల ఛాంపియన్‌గా తన స్థితిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ సమావేశం ఉపయోగపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement