Tuesday, April 30, 2024

మెకిన్సీలో 2 వేల మందికి ఉద్వాసన

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. కంపెనీలకు ఉద్యోగుల తొలగింపుపై కన్సెల్టెన్సీ సేవలు అందించే సంస్థ మెకిన్సీ అండ్‌ కంపెనీ కూడా సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడింది. 2000 మందినికి ఉద్వాసన పలికేందుకు మెకిన్సీ ప్లాన్‌ సిద్ధం చేసింది. కంపెనీ క్లయింట్లతో నేరుగా సంబంధం ఉండని సహాయక సిబ్బందిని తొలగించాలని మెకిన్సీ అండ్‌ కంపెనీ ఉందని ఒక ఉన్నతోద్యోగి తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్ధికంగా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతుననందున సిబ్బందిని పునర్‌వ్యవస్థీకరించాలని భావిస్తోంది. రానున్న రెండుమూడు వారాల్లో తొలగింపు ప్రణాళికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


2012లో మెకిన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఐదేళ్ల క్రితం నాటికి ఈ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు 45 వేల మంది ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. క్లయింట్లతో నేరుగా పని చేసే నిపుణుల నియామకాలు మాత్రం కొనసాగుతాయని మెకిన్సీ వర్గాలు తె లి పాయి. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2022 ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఫైనాన్స్‌ నుంచి టెక్నాలజీ, రిటైల్‌ వరకు అన్ని రంగాల్లోని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాల పేరుతో వ్యయ నియంత్రణలో చర్యలు చేపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఉద్యోగులను తొలగించడమే ముఖ్యమైన చర్యగా ఉంటోంది. ఉద్యోగుల తొలగింపు టెక్నాలజీ రంగంలో అధికంగా ఉంది. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ట్విటర్‌, మెటా వంటి బడా కంపెనీలు వేల సంఖ్యలోఉద్యోగులను తొలగించాయి. మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మెన్‌ శాక్స్‌ వంటి బడా ఆర్ధిక సంస్థలు కూడా సిబ్బందిని ఇంటికి పంపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement