Thursday, May 2, 2024

కొత్త సంవత్సరం ఆశాజనకమే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశానికి విదేశీ పెట్టుబడులు

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మన దేశం 2023లోనూ విదేశీ పెట్టుబడులను ఆకర్షిణీయమైనదిగానే ఉంటుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల మూలంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, సప్లయ్‌ చైయిన్‌ సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన ఆర్ధిక వృద్ధిని నమోదు చేయడం సానుకూల అంశం. మన దేశంలో వ్యాపారం చేసేందుకు ఉన్న సానుకూల అంశాలు, సహజ వనరులు, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ఉదారవాద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వి ధానం, దేశీయంగా అత్యంత భారీ మార్కెట్‌ వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆకర్షిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రతికూల అంశాలు…

అదే సమయంలో విధానాల రూపకల్పన, అమలు విషయంలో జాప్యం, ఇంకా కొన్నింటి విషయంలో గజిబిజి విధానాలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. తాజా ప్రపంచ పెట్టుబడి నివేదిక యుఎన్‌సీటీఏడి 2022 ప్రకారం ఇండస్ట్రీలో గ్రీ న్‌ఫీల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రికవరీ బలహీనంగానే ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ట్రిపుల్‌ పుడ్‌, ఇంధనం, ఆర్ధిక సంక్షోభాలు, కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం, తిరిగి కొవిడ్‌ మహమ్మారి పెరుగుతుందటం, సప్లయ్‌ చైయిన్‌ సమస్యలు వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపింది.

- Advertisement -

2022లో విదేశీ పెట్టుబడులు

మన దేశం 2022లో సంతృప్తికరమైన విదేశీపె ప్రత్యక్షట్టుబడులు(ఎఫ్‌డీఐ)లను సాధించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 జనవరి-సెప్టెంబర్‌ కాలంలో 42.5 బిలియన్‌ విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశానికి వచ్చాయి. 2021లో ఇదే కాలంలో 51.3 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2021-22 పూర్తి సంవత్సరంలో మన దేశంలోకి 84.84 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.

మన దేశ ఈక్విటీ మార్కెట్‌లోకి ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌- సెప్టెంబర్‌ కాలంలో 14శాతం తగ్గి 26.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు 39 బిలియన్లకు క్షిణించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 42.86 బిలియన్లుగా ఉన్నాయి.

మన దేశం ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమల ప్రోత్సహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ చెప్పారు. ఎఫ్‌డీఐ విధానంలో సరళీకరణ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మరింత ప్రోత్సహించడం, పరిశ్రమలపై చట్టపరమైన భారాలు, అడ్డకుంకులు లేకుండా చర్యలు తీసుకోవడం, ఉత్పత్తిని పెంచేందుకు పీఎల్‌ఐ స్కీమ్‌ అమలు, సమగ్ర మౌలిక సదుపాయల కల్పనకు పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయడం వంటి చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.

గత ఎనిమితి సంవత్సరాలుగా మన దేశంలోకి రికార్డ్‌ స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయని చెప్పారు. మందగించిన ఆర్ధిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి సవాళ్లను పరిగణలోకి తీసుకుంటే వచ్చే సంవత్సరంలో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మన దేశం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోతసహాకం (పీఎల్‌ఐ) వల్ల ప్రపంచ స్థాయి సంస్థలు అనేకం మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. ఈ సంస్థలు, కంపెనీలు తయారీని మన దేశానికి మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. నేషనల్‌ సింగిల్‌ విండో విధానం (ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్‌) అభివృద్ధి చెయడంతో వ్యాపారాల అనుమతులు పొందడం తేలిక చేసింది. ఇది ఎక్కువ పెట్టుబడులు మన దేశానికి వచ్చేందుకు సహాయ పడుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరం ఆస్ట్రేలియా, యూఏఈతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 2023-24లో మన దేశానికి మరిన్ని పెట్టుబుడలు వచ్చేందుకు దోహదం చేయనుంది.

1.97 లక్షల కోట్ల ప్రోత్సహాకాలు

దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రారంభించిన పీఎల్‌ఐ స్కీమ్‌ను 14రంగాలకు వర్తింప చేశారు. ఇందు కోసం 1.97 లక్షల కోట్లు కేటాయించారు. ఈ స్కీమ్‌ కింద ఇప్పటి వరకు 13 రంగాలకు చెందిన 650 అప్లికేషన్లను పరిష్కరించారు. 2022-23లో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలు, పీఎల్‌ఐ పథకం వంటి వాటి వల్ల 2023లో మన దేశ ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో ముందుంటుందని నిఫుణులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇండియాలో బలమైన వృద్ధిరేటు, అందుకు తీసుకుంటున్న చర్యల మూలంగా పెట్టుబడులు గమ్యస్థానంగా మారేందుకు సహాయపడుతుందని డెలాయిట్‌ ఇండియా ఆర్ధిక వేత్త రుమ్కీ మజుందార్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయని, అదే సమయంలో జపాన్‌, సింగపూర్‌, యుకే, యుఏఈ వంటి దేశాల నుంచి ఈక్విటీ పెట్టుబడులు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

మన దేశంలోకి 2000 సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ 2022 వరకు 887.76 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 26 శాతం ఎఫ్‌డీఐలు మారిషస్‌ మార్గం ద్వారా వచ్చినవే, దీని తరువాత స్థానం 23 శాతంతో సింగపూర్‌ , అమెరికాజ నుంచి 9 శాతం, నెదర్లాండ్స్‌ నుంచి 7 శాతం, జపాన్‌ నుంచి 6 శాతం, బ్రిటన్‌ నుంచి 5 శాతం ఉన్నాయి. యుఏఈ, జర్మనీ, సైప్రస్‌, కేమన్‌ దీవుల నుంచి ఒక్కోక్క దేశం నుంచి 2 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి.

ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకర్షించిన రంగాల్లో ప్రధానమైనది సర్వీసెస్‌ సిగ్మెంట్‌, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, టెలికమ్యూనికేషన్స్‌; ట్రేడింగ్‌, కన్‌స్ట్రక్షన్స్‌, డెవలప్‌మెంట్‌, ఆటోమొబైల్‌, కెమికల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ ఉన్నాయి.
టెలికం, మీడియా, ఫార్మాస్యూటికల్స్‌, బీమా రంగాల్లో ఆటోమేటిక్‌ రూట్‌లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చినప్పటికీ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. ఈ విధానంలో విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన తరువాత మాత్రమే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఎఫ్‌డీఐలకు మాత్రం ప్రతుత్వ ఆమోదం, సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ రంగాలకు నో పర్మిషన్‌

ప్రస్తుతం మన దేశంలో లాటరీ, గాంబ్లింగ్‌, బెట్టింగ్‌, చిట్‌ఫండ్స్‌, రియల్‌ ఎస్టేట్‌, నిధి కంపెనీ, పొగాకు ఉపయోగించి చేసే సిగార్లు, చెరూట్‌లు, సిగరేట్ల తయారీ వంటి 9 రంగాల్లో ఎఫ్‌డీఐలను ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో మౌలిక సదుపాయలను మెరుగుపరిచేందుకు ఆర్ధిక వృద్ధి పెరిగేందుకు ఎఫ్‌డీఐ ముఖ్యమైనది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఆరోగ్యకరమైన పెరుగుదలను నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. మన రూపాయి విలువ పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement