Tuesday, May 7, 2024

భగవద్గీతకు మరింత చేరువచేసే శ్రీకృష్ణ జన్మాష్టమి!

”ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము” కురుక్షేత్ర యుద్ధ రంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. ఒక దైవిక గ్రంథమైన భగవద్గీత జీవిత లక్ష్యాన్ని సంక్షిప్తం గా తెలియజేస్తూ మానవాళి అంతా హృదయపూర్వకంగా తప్పక అన్వేషించవలసిన అంతిమ సత్యాల గురించి వివ రిస్తుంది. కొంతవరకూ నివ్వెరపోయి, భయాందోళనలకు గురైన తన శిష్యుడిని… ధర్మానికి అన్నిటికన్నా ప్రాముఖ్య త నివ్వమని, మోహంతో కర్మఫలాలకు బంధీ కావొద్దని స్వయంగా భగవానుడే ఇచ్చిన త్రికాలాలకు అతీతమైన ప్రవచనం ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నది.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆధ్యాత్మిక కళాఖండమై న ‘ఒక యోగి ఆత్మకథ’ను రచించిన శ్రీశ్రీ పరమహంస యోగానంద, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన అమర సందే శపు వాస్తవమైన అర్థం గురించి ”భగవానుడు- అర్జునుల సంవాదం” అనే పేరుతో ఆయన రచించిన గీతా వ్యాఖ్యా నంలో చాలా వివరంగా తెలియజేశారు. మహాభారతంగా ప్రాచుర్యంలో ఉన్న కురుక్షేత్ర యుద్ధం యొక్క యధార్థమై న ప్రాముఖ్యత ప్రతి మానవుడి మనస్సులో నిరంతరమూ జరుగుతున్న ఆంతరిక యుద్ధాలలోనే ఇమిడి ఉందని యోగానందగారు వివరించారు. మానవ జీవితంలోని ప్రతి అంకంలోనూ మనలోని మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలతో విధిగా యుద్ధం చేయవలసిందే! అంతిమం గా మంచిచెడులను జయించి తీరవలసిందే, కాని భగవం తుడికి చేరువవడానికి మనం దృఢంగా కృషి చేసి, దాని ఫలి తంగా లౌకిక ప్రపంచంతో ఉన్న బంధాలపై వ్యామోహాన్ని త్యజించడానికి ముందు మాత్రం కాదు.
బాలకృష్ణుడు తన తల్లి దేవకికి జన్మించిన వార్షికోత్స వాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమిగా పండుగ జరుపుకుం టారు. ప్రపంచ వ్యాప్తంగా సంగీతంతో నిండిన అందమైన ఉత్సవాలు తరచుగా రాత్రంతా జరుపుకుంటారు. విష్ణుదే వుని అవతారమైన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం వేడుకలు జరుపుకోవడం కోసం భక్తులు అందంగా అలంకరించబడి న దేవాలయాలలో కలుస్తారు. స్వయంగా తమ ఇళ్ళలోని చిన్నచిన్న మందిరాలను కూడా అలంకరిస్తారు. కాని మహాత్ములు మనకి చెప్పినట్టు జన్మాష్టమి ఉత్సవాన్ని వా స్తవంగా జరుపుకోవాలి. అంటే, మనం కృష్ణ భగవానునితో మరింతగా అనుసంధానంలో ఉండడానికి కృషి చేస్తూ మన హృదయాలలో, ఆత్మలలో జరుపుకోవడం.
కృష్ణ భగవానుడు, భగవద్గీతలోని శ్లోకాలలో రెండు సార్లు క్రియాయోగం గురించి ప్రస్తావించారు. అది మాన వులకు తెలిసిన అత్యున్నత శాస్త్రము. అది ఆధ్యాత్మిక సాధ కుడిని భగవంతుడితో ఏకత్వమనే తన లక్ష్యం వైపు ప్రోత్సహస్తుంది. ఈ మహత్తరమైన జన్మాష్టమి దినాన మన చుట్టూ ఉన్న వారందరి శ్రేయస్సు కోసం మనమం దరం మనలోని కృష్ణుడిని మేల్కొల్పి ఆయన బోధలతో అనుసంధానంలో ఉండడానికి ప్రయత్నిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement