Thursday, May 2, 2024

అగ్నికి అడవుల అహుతి…

తాండూరు, అడవులు అగ్నికిలలకు ఆహుతి అవుతున్నాయి. తరచూ అడవుల్లో కారుచిచ్చు చెలరేగి విలువైన అటవీ సంపద బుగ్గి పాలవుతోంది. వేసవి కాలంలో చెట్ల ఆకులు రాలిపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తరుచూ మంటలు చెలరేగి అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండలంలోని నీలయ్యపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. సమీపంలో గల మామిడి తోటల యజమాని అభిజిత్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్‌ ఇంజన్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఎక్కువగా ఉండటంతో చెట్లు కాలిపోయాయి. అటవీ శాఖ అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement