Friday, May 17, 2024

అరణ్య కలెక్షన్స్ ఎంతంటే!

దగ్గుబాటి యంగ్ హీరో రానా ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి సినిమాతో విలన్ గా మెప్పించిన రానా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేచుకున్నాడు. ఇక అరణ్య విషయానికొస్తే ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏనుగుల సంరక్షకుడిగా నటించాడు రానా. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరణ్య సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

బాహుబలి 2 తర్వాత రానా నటించిన అరణ్యకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, వసూళ్లు మాత్రం రావట్లేదు. ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా ఫ్లాప్ జాబితాలోకి వెళ్లిపోయింది. చాలా చోట్ల అరణ్య పూర్తిగా డల్ అయిపోయింది. కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అరణ్య సినిమా మూడు రోజుల్లో రూ. 4.10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.2.60 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 15 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యంగా కనిపిస్తోంది. దాంతో రానా ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. వచ్చే వీకెండ్ కు సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement