Thursday, May 30, 2024

తరగని పెన్నిధి స్నేహ హస్తం!

”మానవుల మధ్య సంబంధాలు స్నేహభావంతో ఉండాలని వేదం అనేక చోట్ల కాంక్షించింది” అంటా రు ఋషి పీఠాధిపతి సామవేదం షణ్ముక శర్మగారు. మితృత్వ లక్షణాలు చె బుతూ అర్జునునితో ”కౌంతేయ! ఏ ప్రాణిని ద్వేషించక మితృత్వంతో ఉండు వాడు, ప్రాణుల యెడ స్నే హభావం, దు:ఖితుల యెడ, కరు ణ కనబరుచువాడు గొప్ప స్నేహితు నిగా భావించబడును” అంటాడు.
శ్రీమద్రామయణంలో వాల్మీకి రామ సుగ్రీవుల మైత్రి వల్ల ఒనగూరిన లాభాల గురించి విలక్షణ రీతిలో వర్ణించా డు మహాభారతంలో కర్ణునితో కు దిరిన స్నేహానికి చిహ్నంగా అర్ధ అంగరాజ్యానికి రాజుగా ప్రకటి స్తాడు సుయోధనుడు. మహాభా గవతంలోని దశమ స్కంధంలో మైత్రికి వీరిద్దరే ఆదర్శప్రాయులని గురుదీవెనలు పొందిన కృష్ణ కుచే లుర స్నేహాన్ని కుచేలోపాఖ్యానంగా వివరించాడు మహర్షి.
సాందీపుని గురుకులంలో కృష్ణ కుచేలురు కలిసి చదు వుకుంటారు. విద్యను ముగిశాక శ్రీకృష్ణుడు ద్వారకకు రాజై రుక్మిణిని వివాహమాడతాడు. కుచేలుడు (సుధాముడు) తన స్వం త ఊరికెళ్ళి సుశీల అనే యువతిని పెండ్లాడుతాడు. ఆమె సద్గుణ సంపన్నురాలు. కుచేలుడు మహాజ్ఞాని, గొప్ప ఆధ్యాత్మిక వేత్త. బ్రాహ్మణుడు కావడంవల్ల ఆయన తన పూ ర్వీకుల వృత్తినే ఆచరిస్తూ అరకొర సంపాదనతో కుటుంబా న్ని నెట్టుకు వస్తుంటాడు. ఆయనకు అనేకమంది సంతానం. ఈ కారణాలు అతని కుటుంబాన్ని కడు పేదరికం అనుభవిం చేది. పేదరికంలో ఉండికూడా కుచేలుని భార్య ఏనాడు తన భర్తతో ఇంటి పరిస్థితి గురించి చెప్పక తానే బాధపడేది.
ఒకరోజు పిల్లలు, అమ్మా! ఆక లి… ఆకలి అంటూ బాధ భరించలేక ఒకరిద్దరు సొమ్మసిల్లిపోతారు. తల్లి హృదయం తాళలేక భర్తతో ”ఈ దారిద్య్రాన్ని దూరం చేయ ఏమైనా ఆలోచించండి. మీ చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడు మహా రాజు, గొప్ప ధర్మాత్ముడని విన్నాను. మీరు ఆయన్ని ఎందు
కు ఆశ్ర
యించకూడదు? ఆయన మన పరిస్థితి కి స్పందిస్తారని నానమ్మకం” అంది.
భార్య మాటలకు కుచేలుడు ”చా లా సంవత్సరాలు గడిచాయి. నన్ను గు ర్తుపట్టడేమో” అంటాడు. ”గుర్తు పడ తారు. నా మాట కాదనకండి” అంటూ ప్రాధేయపడుతుంది. ఎన్నడూ అర్థించని ధర్మపత్ని వేడుకో లు ఆయన మనసును కదిలించడంతో తనకిష్టం లేకపోయి నా కుచేలుడు ద్వారకకు పయనమవుతాడు. ఆ పరమాత్ము ని దగ్గరకు ఉత్త చేతితో ఎలా వెళ్ళను అనేమాట వినగానే మూలన ఉన్న కుండలోని అటుకులు గుర్తొచ్చి చటుక్కున సుశీల వాటిని పైపంచె చివరన మూట కట్టి భర్తను ద్వారకకు సాగనంపుతుంది. కుచేలుడు బయలుదేరతాడు కాని, ఆయ న మనస్సు ఆయన్ని అనేక ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ద్వారకానగరంలో అనేక రాజసౌధాలు, తన స్నేహితుడైన కృష్ణుని అంత:పురం ఎటువైపుఉందో, ఎలాగో అంత:పురం చేరతాను, మరి నన్ను చూసిన ద్వారపాలకులు వారి ప్రభు వుని కలిసే అవకాశం ఇస్తారా! అన్నింటికి ఆయనే నాకు శరణ్యం అనుకొని అంత:పురానికి చేరతాడు.
పరమాత్ముని రాకను దూరం నుండే గమనించిన కుచే లుడు ఇట్టే గుర్తుపట్టి పొంగిపోతూ తను చూస్తున్నది నిజ మేనా, ”నా మిత్రుడు చిన్ననాటి జ్ఞాపకాలను మరచిపోయి నట్టు లేదు” అనుకుంటూ గబగబా పరమాత్మకు ఎదురేగ సాగాడు. దారిద్య్రంతో పీడించబ డుతున్న కుచేలుని చూసిన కన్నయ్య ఉబికివస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ కౌగిలించు కుంటాడు. ప్రేమగా తీసుకువచ్చి కుచేలుని తన హంస తూలి కా తల్పంపై కూర్చోపెట్టి. అతిధి మర్యాదలు చేయసాగాడు.
శ్రీకృష్ణుడు తమ విద్యార్థి దశలోని సంగతులను మన నం చేయసాగాడు. తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణు డి మాటలు వింటూ కుచేలుడు ఎంతో ఆనందానుభూతికి లోనవుతాడు. కృష్ణ పరమాత్మే స్వయంగా తనకే మైనా కానుక తెచ్చావా అన్నప్పుడు కుచేలుడు మౌనంగా ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టితో స్నేహి తుని మౌనానికి గల కారణం తెలుసుకొని పైపంచె చివరనున్న మూటను చూసి, తనకు చూపలేదేమి టని అంటూ విప్పుతాడు. అందులోంచి పిరికెడు అటుకులు తీసుకుని తింటాడు. మరో పిరికెడు తిన బోగా ఒక పిడికెడు చాలంటుంది రుక్మిణీదేవి. కుచేలు డుక్కడేవుండి మర్నాడుదయమే తన ఊరికి బయలు దేరిన కుచేలుడిని కృష్ణుడు సాగనంపుతాడు.
తన ఊరు చేరిన కుచేలుడు తన స్వగృహాన్ని గుర్తు పట్టలేకపోతాడు. భవనం పైనుండి చూసిన కుచేలుని భార్య గబగబా వచ్చి భర్త కాళ్లకు దండం పెడుతుంది. భార్య మెడలోని బంగారు ఆభరణాలు, పిల్లల ఒంటి మీది దుస్తు లను చూసిన కుచేలుడు ఇవన్నీ తన స్నేహితుడిచ్చిన సిరిసం పదలే అనుకుని, ధన్యవాదాలు చెప్పుకొని ఆయన నామస్మరణ చేయసాగాడు. కుచేలుడు ఆ భోగభాగ్యాలకు మురిసిపోకుండా దంపతులు శేష జీవితాన్ని భగవన్నామస్మరణతో గడుపుతూ పరమాత్మలో లీనమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement