Sunday, April 28, 2024

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి చ‌లానా – నెంబ‌ర్ ప్లేట్ స‌రిగాలేద‌న్న పోలీసులు

హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి చ‌లానా విధించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనందుకు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు హైదరాబాద్‌ సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా విధించారు. బ్యాంక్‌ స్ట్రీట్‌లో వెళ్తున్న ఎస్వీకృష్ణారెడ్డి బీఎండబ్ల్యూ కారు ను తనిఖీ చేయగా..ఆయన కారు నెంబర్‌ ప్లేట్‌ సరిగా లేదని గుర్తించారు. ఇర్రెగ్యులర్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న కారణంగా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్‌ చలానా విధించారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి స్పందిస్తూ..‘కారు నెంబర్‌ ప్లేట్‌ సరిచేసుకుంటానని, మండుటెండల్లో సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల అంకితభావం అభినందనీయమన్నారు. ఇప్పుడీ వార్త వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement