Thursday, November 14, 2024

Flash: కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నెల్లూరు జిల్లా సంగం హరిజన వాడలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డం వెంకటేశ్వర్లు, హైమా కుమారుడైన శ్రీరామ్ (8)‌ తమ బంధువైన ఈశ్వర్ (10) తో కలిసి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కనిగిరి కాలవలో పడి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికులు సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement