Wednesday, May 1, 2024

అమెజాన్ ప్రైమ్ లో – థాంక్యూ మూవీ

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో .. నాగచైతన్య హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ టీజర్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే జూలై 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.కానీ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో ముఖ్యపాత్రలో మాళవికా నాయర్, అవికా గోర్ నటించగా, సంగీతం థమన్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్‌ వాళ్లు కొనుగోలు చేసారు. ఇక ఈ క్రమంలోని ఆగస్టు 11వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement