Thursday, May 16, 2024

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం – ఆందోళ‌న విర‌మించండి-వీఆర్ఏల‌కి మంత్రి కేటీఆర్ పిలుపు

స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తున్నారు వీఆర్ ఏలు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం అసెంబ్లీ ముట్ట‌డికి య‌త్నించారు. కాగా గ‌త కొన్ని రోజులుగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్య‌మిస్తున్న వీఆర్ఏల‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు. కాగా అసెంబ్లీ ముట్ట‌డికి వ‌చ్చిన వీఆర్ఏల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో వీఆర్ఏల‌తో ..కేటీఆర్ చ‌ర్చ‌ల‌కు సిద్ధం కాగా…మంత్రి ఆహ్వానాన్ని మ‌న్నించి వీఆర్ఏలు కూడా చ‌ర్చ‌ల కోసం కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, వేత‌నాల పెంపు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్‌కు ముందు వీఆర్ఏలు పెట్టారు. వీటిపై దృష్టి సారించిన మంత్రి… వీఆర్ఏల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ నెల 20న మ‌రోమారు ఈ అంశాల‌పై స‌మ‌గ్రంగా వీఆర్ఏల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో వీఆర్ఏలు ఆందోళ‌న విర‌మించాల‌ని కేటీఆర్ కోరారు. మంత్రి ప్ర‌తిపాద‌న‌పై స్పందించిన వీఆర్ఏలు త‌మ సంఘం నేత‌ల‌తో చ‌ర్చించి త‌మ నిర్ణ‌యాన్ని చెబుతామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement