Sunday, April 28, 2024

Warns – ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు …జైలుకు పోతారుః ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ – సోషల్ మీడియాలో తప్పుడు వార్త‌లతో ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామని ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలంటే వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రజలను ఆందోళన కలిగించే ప్రచారం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ, రూ.7 వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది అంటున్నారు బీఆర్ఎస్ వాళ్లు.. కానీ అప్పటికే ఖజానాలో 3960కోట్లు లోటు ఉందని తెలిపారు. రూ. 7 వేల కోట్లు ఎవరు తిన్నారు.. ఎటు పోయాయి.. ఎవరి అకౌంట్ లోకి పోయాయి? అని భ‌ట్టి ప్రశ్నించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాలుగు నెలల్లో మేము రూ.26 వేళా కోట్ల అప్పులు కట్టినామన్నారు. రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అని తాము ఎప్పుడూ అనలేదని అంటూ త్వరలోనే రుణమాఫీ చేస్తామని అన్నారు.

ఆర్థిక ప‌రిస్థితిపై చ‌ర్చ‌కు సిద్ధం…

- Advertisement -

రూ.3927 కోట్ల పవర్ సబ్సిడీ చెల్లించిన‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి చెప్పారు. డైట్.. మధ్యాహ్నం భోజనం నిధులు.. మహిళా సంఘాలకు నిధులు ఇచ్చామన్నారు. ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాను సిద్ధమన్నారు. మార్చి నుంచి 15673 మెగావాట్ల డిమాండ్ వచ్చిందని, అయినా.. కట్ లేకుండా పవర్ అందించామని క్లారిటీ ఇచ్చామన్నారు. ఏప్రిల్.. మే నెల‌ల్లో కూడా పవర్ డిమాండ్ ఎంత పెరిగినా.. అందుబాటులో ఉంచాం విద్యుత్ అన్నారు. ఎన్టీపీసీ నుండి విద్యుత్జ్ ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందిస్తే.. 8 నుండి 9 రూపాయల యూనిట్ ఖర్చు అవుతుందన్నారు. కానీ, సోలార్ పవర్ పెడితే.. 5 రూపాయలకే వచ్చే 25ఏళ్లకు సప్లై చేస్తాం అంటున్నాయని, అధిక రేటు ఎందుకు పెట్టినట్టు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వ్యవహారం పైశాచికతత్వం ఉందన్నారు. రూ. 20 కి యూనిట్ విద్యుత్ కొన్నదని అన్నారు. గ్రీన్ పవర్ ని రాష్ట్రానికి తక్కువ ధరకు అందిస్తామన్నారు.

అయిదేళ్లూ ప‌రిపాలిస్తాం..

సమస్యలు పరిష్కారం చేసే త‌మ ప్రభుత్వం ఉండదని అంటున్న కేసీఆర్, త‌ లకిందులు తప్పస్సు చేసినా అయిదేళ్లు సుస్థిరంగా ప్ర‌జాపాల‌న సాగిస్తామ‌న్నారు భ‌ట్టి . R ట్యాక్స్.. B ట్యాక్స్ పై విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ తన లాంటి వాళ్లు తపనతో రాష్ట్రాన్ని నిర్మించే పనిలో ఉన్నామన్నారు. త‌మ‌ లాంటి వాళ్ళను అడ్డుకోవడానికి కొందరు కుట్ర దారులు R ట్యాక్స్.. B ట్యాక్స్ అని ఆరోపిస్తున్నారని తెలిపారు. ఎస్ ఎల్ బి సి ని పదేళ్ళలోకెసిఆర్ అసలు పట్టించుకోలేద‌ని అంటూ తాము డిండి.. నక్కల గండి లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే.. ఖమ్మంలో 2 లక్షల ఎకరాల భూమి ఏపీకి ఇచ్చార‌ని ,దానిని ఆర్టినెన్స్ తెచ్చి ఆ భూములు తెలంగాణ‌కు తిరిగి ఇవ్వ‌ల‌న్నారు. .. 10 ఏండ్లలో 10 లక్షల కోట్లు ఇచ్చామ‌ని చెప్ప‌డం స‌రికాదంటూ రాష్ట్ర వాటా గా వచ్చిన డబ్బు 3 లక్షల 70 వేల‌ 235 కోట్లు అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది బ్లాక్ మెయిల్ చేశారని.. ఫోన్ లు విని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది తప్పు కాదా? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement