Sunday, May 5, 2024

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు కళకళలాడాలి : ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపోందిచాలానే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమం పల్లె ప్రగతి అని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం ల్యాబార్తి గ్రామంలో ఏర్పాటు చేసిన 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, అధికారులు సమష్టి కృషితో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి అవసరమైన సౌకర్యాల కల్పనకు తీర్మానాలు చేసుకోవాలని ఆదేశించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్యం, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement