Sunday, May 19, 2024

పీజీ వైద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి… 6వరకు వెబ్ ఆప్షన్లు..

వరంగల్ : పీజీ వైద్య తొలి విడత ప్రవేశాలకు వరంగల్ లోని కాళోజి హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈనెల 6వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలతో పాటు, నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు 4వ తేదీ ఉదయం 11గంటల నుండి 6వ తేదీ ఉదయం 11 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement