Sunday, May 5, 2024

గుడిసెలు వేసుకున్న పేదలను ఆదుకుని ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి

గుండ్ల సింగారంలో గుడిసెలు వేసుకున్న పేదలను ఆదుకుని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో ఆదివారం హన్మకొండ కేయూ క్రాస్ రోడ్ లో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో వందలాది మంది గుడిసె వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అడ్డుకొని తొలగించే ప్రయత్నం చేయగా పోలీసులకు, సీపీఐ నాయకులకు మధ్య‌ వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపి, జిల్లా మంత్రులు స్పందించి పేదలకు ఇండ్ల స్థలాలు అందించాలని కోరారు. గత రెండు నెలలుగా గుడిసె వాసులు పోరాటం చేస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన భాద్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు.

గుండ్ల సింగారంలో గుడిసె వాసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు కాలయాపన చేయడం సరికాదని, ఇప్పటికే రాష్ట్ర డిజిపికి సైతం తాము ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు సాదించే వరకూ తాము పోరాటాన్ని ఆపబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా నాయకులు కొట్టెపాక రవి, కండె నర్సయ్య, రాజేందర్, శివ, దేవా, శైలజ, సంపత్, మమత, మంగ, రజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement