Wednesday, May 15, 2024

WGL: అర్థరాత్రి వేళ గర్భవతిని హాస్పిటల్ కు చేర్చి మానవత్వం చూపిన కేయుసి పోలీసులు

కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గర్భవతి మహిళ పురిటి నొప్పులతో అర్థరాత్రి సుమారు 2.30 సమయంలో తన భర్తతో కల్సి హాస్పిటల్ వెళ్ళేందుకు వాహనం కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై ఉన్నారు. అప్పుడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కేయుసి పెట్రోలింగ్ కానిస్టేబుళ్ళు షబ్బీర్, యుగేందర్, వాసు లు రోడ్డుపై వాహనం కోసం ఎదురుచూస్తున్న గర్భవతి మహిళను గమనించి తక్షణమే స్పందించి… ఆమెతో పాటు ఆమె భర్తను పెట్రోలింగ్ కారులో సదరు గర్భవతి మహిళను సమయానికి హాస్పిటల్ కు చేర్చిన సంఘటనతో ఖాకీ చొక్క చాటున కరుకు గుండె కాదని, కారుణ్యం దాగి వుందని వరంగల్ పోలీసులు మరోమారు రుజువు చేశారు.

సమయానికి గర్భవతిని హాస్పిటల్ కు చేర్చిన కేయుసి పెట్రోలింగ్ పోలీసులకు సదరు మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు గర్భవతిని హాస్పిటల్ లో చేర్పించడంలో చొరవ చూపిన కేయుసి పెట్రో కార్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement