Sunday, May 19, 2024

వరికి కేంద్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలి : ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల : రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేన‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ… రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగిలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలని ఈ మండల సభ ద్వారా తీర్మానం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద, జడ్పీటీసీ సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ రాంబాబు, ఎంపీడీవో రామయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లయ్య, కో ఆప్షన్ సభ్యులు రాజు మమ్మద్, మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement