Wednesday, May 1, 2024

శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

వరంగల్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని నేడు రేలకుంట గ్రామ ఆరె కులస్తులు ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ విగ్రహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… శివాజీ జీవితం అన్ని కులాలకు మతాలకు, ఆదర్శవంతం అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఉన్న ఆరె కులస్తులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ, సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement