Sunday, May 5, 2024

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : ఎమ్మెల్యే సీత‌క్క‌

ఏటూరు నాగారం పట్టణ కేంద్రంలో గోదావరి ముంపు ప్రాంతాలను వాడవాడలా తిరుగుతూ ప్రజలు పడుతున్న బాధల‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలుసుకున్నారు. శుక్ర‌వారం ఏటూరు నాగారం పట్టణ కేంద్రంలో గత వారం రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరుద ఉద్రితి వలన ఇండ్లలోకి నీరు చేర‌డంతో ప్రజలు ప్రాణాలను అర‌చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నార‌న్నారు. గోదావరి క్రమేపీ పెరుగుతూ వస్తోంద‌ని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముంపుకు గురైన కుటుంబాలకు అండగా ఉండాల‌న్నారు.

నష్ట పోయిన ప్రతి కుటుంబానికి 25వేల ఆర్థిక సాయం తో పాటు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిటమట రఘు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ వావిలాల నర్సింగరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు MD.అయూబ్ ఖాన్, జిల్లా నాయకులు MD ఖలీల్ ఖాన్, ఎంపీటీసీలు బానోత్ భాస్కర్, గుడ్ల దేవేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి MD గౌస్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement