Friday, May 3, 2024

నిరుపేద రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా చికిత్స అందించాలి

వరంగల్ జిల్లా నర్సంపేట సివిల్ హాస్పటల్ ని మరో రెండు సంవత్సరాల పాటు ఇదే ఆసుపత్రి తరహాలోనే కొనసాగించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరంగల్ జిల్లా స్థాయిలో 66 కోట్ల రూపాయలతో 250 పడకల నూతన హాస్పిటల్ నిర్మాణ పనులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారని ఈ హాస్పిటల్ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి సంవత్సరన్నర సమయం పట్టనున్నదని తెలిపారు. అప్పటివరకు నిరుపేద రోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఇప్పుడున్న సివిల్ ఆసుపత్రిలోనే అవసరమైన చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు, ఐసీయు సేవలు, ఆక్సిజన్, డయాగ్నస్టిక్ సెంటర్ తో పాటు అంబులెన్స్ లాంటి సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని,కిడ్నీ సంబంధిత రోగుల కోసం ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుకు చేశారు.సివిల్ ఆసుపత్రికి అదనంగా అవసరమైన పరికరాల మంజూరు కోసం ఉన్నతాధికారులకు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి సమావేశంలో తీర్మానం చేసి వారి దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement