Friday, April 26, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి



హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆదివారం భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి , వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ గోదావరి పై కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మంచుకుని,ఆ నీటిని పంట పొలాలకి మళ్లించి, బీడు భూములను పంట పొలాలుగా చేసుకుని అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని మన కేసిఆర్ గారు తీర్చి దిద్దారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పంట పెట్టుబడి సాయం, రైతు భీమా,ఋణ మాఫీ,24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయ్యం అని చెప్పిన రైతులకు అండగా కేసీఆర్ నిలిచి రాష్ట్ర ప్రభుత్వంమే వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. హెల్త్ విషయం లో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు కు దాదాపు 17 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా వచ్చిన రూ.16,000/- ల సీఎంఆర్ఎఫ్ చెక్కును లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్, పరకాల ఏఎంసి వైస్ చైర్మన్ నందం, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్,వార్డు సభ్యులు,డైరెక్టర్లు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు ఎమ్మార్వో , ఎంపీడిఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement