Monday, May 6, 2024

ఈ నెల 9న – అంటే సుంద‌రానికీ ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్

ఈ ఏడాది జూన్ 10న విడుద‌ల కానుంది అంటే సుంద‌రానికీ చిత్రం. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్ పై ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నేచుర‌ల్ హీరో నాని.. మలయాళ నటి నజ్రియ ఫాహద్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ క్రమంలోనే సాంగ్స్ ను ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్ ‘ఎంత చిత్రం’ ప్రోమో విడుదల చేశారు. సదరు ప్రోమోలో నాని తనకు ఏమైందో..అన్నట్లు గా తనలో తాను మురిసిపోతున్నాడు. ప్రేమలో పడ్డట్లు నాని, నజ్రియా ఇచ్చే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో ఈ నెల 9న సాయంత్రం 6.03 గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నారు నేచురల్ స్టార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement