Saturday, May 4, 2024

మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : అదనపు కలెక్టర్ కుమార్

మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భగీరథ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టిన పేరుని దీక్షకు తత్వానికి ప్రతిరూపం అని అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా అనుకున్న సాధించే వారిని భగీరథనీతో పోలుస్తారని, కఠోర పరిశ్రమ చేసి అసాధ్యమైన దాన్ని సాధించే వారిని భగీరథ ప్రయత్నం అని అంటారు అని తెలిపారు. పురాణాల ప్రకారం దివి నుండి భువికి గంగను ఎంతో కష్టపడి భగీరథుడు తీసుకొచ్చాడు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భగీరథుని స్ఫూర్తితో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిందని, అదే సమయంలో సాగునీటి రంగంలో సైతం భగీరథ ప్రయత్నం గా భారీ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని తెలిపారు. యువకులు సైతం భగీరధుని ఆదర్శంగా తీసుకొని జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యసాధన దిశగా పని చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.సహయ వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు అశోక్ ,అంజయ్య ,రవీందర్ , సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement