Tuesday, October 8, 2024

కెసిఆర్, కెటిఆర్ త్వ‌ర‌గా కోరుకోవాల‌ని కోరుతూ మంత్రి స‌త్య‌వ‌తి పూజ‌లు..

వరంగల్‌ : క‌రోనా భారీన ప‌డిన‌ సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లు త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భద్రకాళి అమ్మవారి ఆల‌యంలో ప్ర‌త్యేక‌ పూజలు చేశారు. కొవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, కరోనా పీడ త్వరగా వదిలి పోవాలని , యావత్‌ తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పూజ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement