Sunday, November 10, 2024

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వాయిదా ?

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు సినిమా షూటింగులు నిలిచిపోతున్నాయి. థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. కాగా ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు లో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేలో ప్రారంభం కావాల్సిన ఈ షో పై ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి.

కానీ షో కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే మార్చి 13న మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ ఫైవ్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ ను నిర్మాణ సంస్థ పరిచయం చేసింది. కాగా ఈ సీజన్ కు ఎన్టీఆర్ 7 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement