Monday, May 20, 2024

జయశంకర్ జిల్లా ఆంధ్రప్రభ 2022 క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆంధ్రప్రభ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కేంద్రంలో బుధవారం ఉమ్మడి వరంగల్ బ్రాంచ్ మేనేజర్ తిరుపతి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముందుగా సీనియర్ పాత్రికేయులు ముక్కర రాఘవులు గౌడ్ కు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించి, అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించి పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, పాత్రికేయులు రాచర్ల ప్రభాకర్, బెల్లం తిరుపతి, బుర్ర చక్రపాణి గౌడ్, పోలిశెట్టి నరేష్, రెవెల్లి నాగరాజు , కాయిత తిరుపతి, పసునూటి రవి, యాంసాని రాజు , కటకం రాజు, జాడి రాజు, నెరేళ్ల ఓమ్ నారాయణ గౌడ్,అరిగెల జనార్దన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement