Thursday, May 9, 2024

తొర్రూరులో భారీగా గుట్కా అంబర్ పట్టివేత

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు, నెల్లికుదురు మండలాల్లో గుట్కా, అంబర్ నిల్వచేసి మండలంలో వివిధ షాప్ ల‌కు విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని సుమారుగా రూ.4,38,200లు విలువ గల గుట్కా, అంబర్, రెండు బైకులు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. తొర్రూర్ లోని రాజీవ్ నగర్ లో ఒక రూమ్ లో అంబర్, గుట్కాలను నిల్వచేసి ద్విచక్ర వాహనాలపై వివిధ షాపులకు చేరవేస్తున్నారు. సమాచారంతో పోలీసులు వీరిని చాకచక్యంతో పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ… గుట్కా అంబర్ ఎవరు అమ్మినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సస్పెక్స్ సీట్స్ ఓపెన్ చేసి నిరంతరం వారిపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో గుట్కా అంబర్ లను పట్టుకున్న సీఐ, కరుణాకర్ రావు, ఎస్ఐ సతీష్, రాజు, రాంజీనాయక్, సిబ్బందిని అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement