Monday, May 20, 2024

ఆరాధ్య దేవతవాసవీ కన్యకాపరమేశ్వరి

దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి జగజ్జనని పరమేశ్వరి కన్యక అవతారం దాల్చింది. వాసవీమాత అయ్యింది. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన వాసవీ దేవి ఆత్మార్పణ చేస్తూ అగ్నిప్రవేశం చేసి నేటికి 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. వాసవీ మాత మాఘ శుక్ల పక్ష విదియ శుక్రవారం శతభిష నక్షత్రం రోజున ప్రాయోపవేశం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తైమూర్య దేవతలకు మూల కారణమైన భువనేశ్వరీదేవిని వాసవీ కన్యకా పరమే శ్వరీ రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది. గోదావరీ తీరాన గల 714 గోత్రీకుల కు నిలయాలైన 18 పట్టణాలకు కేంద్రంగా పెనుగొండ ముఖ్య పట్టణంగా మహా సంప దలతో, వైశ్యులలో తలమానికమైన, వేంగి దేశాన్ని ఏలే వైశ్యులకు రాజైన కుసుమ శ్రేష్ఠి, కుసుంబాదేవి దంపతులకు అనేక జన్మార్జితాలైన పుణ్యాలకు తోడు పుత్ర కామేష్టి యాగ ఫలము ఏకమై జగజ్జనని పరమేశ్వరీదేవి, వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం, కన్య రాశిలో అవతరిం చింది. అంతకు కొన్ని నిమిషాల ముందే ఒక బాలుడు జన్మించాడు. పరమేశ్వరుని పూజాఫలమైన కుమారునికి విరూపాక్షు డని, జగజ్జనని అవతారమైనందున పర మేశ్వరి అని నామకరణాలు చేశారు. దేవి సర్వప్రాణులలో శక్తి రూపాన వసిస్తున్నందున ”వాసవి” అని, పరపురు షులవైపు చూడక, పరమేశ్వరుని యందే మనసు లగ్నం చేసినందున ”కన్యక” అని నామాంకితయైనది. ఇరువురు కుల గురువు భాస్కరాచార్యుని వద్ద వేదోక్త సంస్కా రాలు, వేదాంగాలు నేర్చుకోగా, పరమేశ్వ రి, పండితుల చెంత సంగీత నాట్య సకల కళలలో అస మాన ప్రతిభురాలై, విదుషీమణియైనది. యుక్త వయస్కు డైన విరూపాక్షునకు, సంపన్న కుబేరుడైన అరిది శ్రేష్టి కూతురు రత్నావళితో వివాహం జరిపించారు. పరమేశ్వరి ¸°వనవతియై, విశ్వమయుడైన మృత్యుంజయుడి యందే మనసు లగ్నం చేసి నిరంతర ధ్యానం చేస్తున్నది. ఇలా ఉండగా రాజమహేంద్రవరాన్ని పాలించే దుష్టుడైన విష్ణువర్ధనుడు, పక్క రాజ్యాలను జయించి, తిరిగి వెళు తూ, పెనుకొండ వద్ద ఉద్యానవనంలో బసచేయగా, కుసుమ శ్రేష్ఠి తమ ప్రభువును దర్శింప కట్నకానుకలు, దాసదాసీ జనంతో వెళ్ళాడు. రాజును చూడడానికి మహేశ్వరి, తన తల్లి కుసుంబా దేవితో వెళ్ళి, ఆమె వెనక నిలుచుంది. అపురూప సౌందర్యవతియైన మహేశ్వరిని రాజు చూసి, మోహ పరవశుడై తాను వివాహం చేసుకుంటానని, అంగీక రించకపోతే బలవంతంగా తీసుకువెళతానని ప్రకటిస్తాడు. 714 గోత్రికులు సమావేశమై, ఇట్టి వివాహం వర్ణ సంకరం, వయో వ్యత్యాసముచే అనుచితమని నిర్ణయించారు. అయితే రాజుకు నచ్చ చెప్పి పంపుతారు.
కొన్ని రోజులకు విష్ణువర్ధనుడు తిరిగి వివాహ యత్నం చేయగా, పరమేశ్వరిని ఇవ్వడానికి సిద్ధంగా లేమని సమాధానం పంపుతారు. ఇది విన్నంతనే రాజు సందేశ హరులను బంధిస్తాడు. వారు తప్పించుకుని, పెనుకొండకు చేరతారు. కుల గురువగు భాస్కరాచార్యుడు అక్షయ నామ సంవత్సర ఫాల్గుణ శుక్లపక్ష పాడ్యమి నాడు 18 పట్టణాల 714 గోత్రికులతో నగరేశ్వర మండపాన సమావేశపరచగా, మహేశ్వరితోపాటు అగ్నిప్రవేశం చేయ నిర్ణయించారు. కన్యకను అభిప్రాయం కోరగా, పరంజ్యోతి నుండి తనను ఎవరూ వేరుపరచజాలరని, అగ్నిప్రవేశం ద్వారా జ్ఞాన మార్గాన పరమేశ్వరుని చేరుకుని, కైలాస వాసిని కాగలనని తేల్చి చెప్పింది. ఇదివిన్న కొంతమంది ప్రాణ భయంతో పారిపోగా, 102 గోత్రికులు కన్యకతో ప్రాణ త్యాగానికి సంసిద్ధులౌతారు. అగ్ని ప్రవేశ సమయాన వాసవి తన తల్లి దండ్రులు నలకూబర దంపతులని, వీరనారాయణ పుర వాసులగు ధనగుప్త దంపతులు కైలాస నివాసులు, నందీ శ్వర దంపతులని, 102 గోత్రికులు ప్రమథ గణాలకు చెంది నవారని వివరించింది. దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. ఆమె తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి అవత రాన్నని, ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేం దుకు, విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదా ర్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించా నని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతి గా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలని చేరుకుంటానని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మబలి దానానికి పురికొల్పా ను అని చెప్పి. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితి, సమాజ సేవ, స#హనం గురించి వివరించింది.
వైశ్యులంతా వేద చోదితమైన మార్గమును వీడవల దని, వేదోక్త సంస్కారాలన్నిటినీ ఆచరించాలని, గాయత్రి మంత్ర జపమాచరించాలని, శృతి స్మృతి నిర్దేశిత మార్గా న్ని అనుసరించాలని, ధర్మమార్గాన్ని వీడ వలదని బోధిం చింది. ఆ తర్వాత అగ్నిగుండాన ప్రవేశించి, ఆత్మార్పణం ద్వారా నిజ స్థానాన్ని పొందింది. 102 గోత్రికులు ఆమెను అనుసరించి పుణ్యలోక ప్రాప్తులైనారు. నాటి నుండి వైశ్యు లు త్రిమూర్తులకు మూల కారణమైన భువనేశ్వరిని కన్యకా పరమేశ్వరీ రూపాన పూజించడం సదాచారంగా, సత్సం ప్రదాయంగా మారింది. వైశ్యులు కులదేవతగా ఆరాధించ డం మొదలుపెట్టారు. వాసవి కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచి పోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆమె అజరా మరం అయింది.

  • రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement