Tuesday, April 30, 2024

WGL: బీఆర్ఎస్ నుండి చెన్నారావుపేట ఎంపీపీ బహిష్కరణ

వరంగల్ జిల్లా చెన్నారావుపేట ఎంపీపీ బాధావతు విజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు రైతు బంధు సమితి చెన్నారావుపేట మండల కన్వీనర్ బుర్రి తిరుపతి శనివారం తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తిరుపతి మాట్లాడుతూ… గత కొద్దికాలంగా ఎంపీపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తొగరు చెన్నారెడ్డిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. పార్టీ కార్యక్రమాల చర్చల నిమిత్తం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతున్న సమయంలో మండలానికి చెందిన సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డిపై ఎంపీపీ చేయి చేసుకోవడంతో పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందన్నారు.

గతంలో ఎమ్మెల్యే గ్రామాలకు ఇచ్చిన అభివృద్ధి పనుల విషయాల్లో అడ్డంకులు కలిగించారని, 30 గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు చెప్పిన అభిప్రాయం ప్రకారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీని, చెన్నారెడ్డిని పార్టీ నుండి బహిష్కరించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement