Saturday, May 4, 2024

ప్రతి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఎమ్మెల్యే వీరయ్య

వాజేడు : గోదావరి వరద ముంపు బాధితులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. ఈరోజు ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో పర్యటించారు. గోదావరి వరదకు ధ్వంసమైన రహదారులను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. మండలంలోని గుమ్మడిదొడ్డి చెరుకూరు కడేకల్ కృష్ణాపురం చంద్రుపట్ల టేకులగూడెం తదితర గ్రామాల్లో పర్యటించిన గోదావరి వరదల వలన వాజేడు మండల పరిధిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరద బాధితులకు తక్షణ సహాయం కింద నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా వరద ముంపునకు గురైన గ్రామాల బాధితులకు ఇంటి స్థలాలు కేటాయించి, డబ్బులు, పెట్రోలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గోదావరి వరదల వలన వాజేడు మండలంలోని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ధ్వంసమైన రహదారుల స్థానంలో నూతనంగా రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ గ్రామం తిరుగుతూ వరద బాధితులను పరామర్శించి ఓదార్చారు. వరద బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం జరిగేవిధంగా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యవసర సరుకులను వరద బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగారం సర్పంచ్ తల్లడీ ఆదినారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దాట్ల వాసు బాబు, కాంగ్రెస్ నాయకులు కాకర్లపూడి విక్రాంత్ బాబు, పూనం రాంబాబు, ఎస్.కె ఖాజావలి, దాట్ల సుధాకర్, బోలె దేనార్జన్, ఆలం సీతాలు, బోదెబోయిన సురేష్, నరేడ్ల రమేష్, గొడ్డే శరత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement