Saturday, May 18, 2024

TS : ఇవాళ మ‌ల్కాజ్‌గిరిలో కేటీఆర్ రోడ్‌షో

ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేటీఆర్‌ రోడ్‌ షోలను చేప‌ట్టానున్నారు.

- Advertisement -

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్‌ చౌరస్తా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్‌, మేడ్చల్‌ నియోజకవర్గంలోని మేడ్చల్‌లో కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ.వివేకానంద్‌, మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్‌షోకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement