Saturday, May 4, 2024

TS: గుడిసెవాసుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా… ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

గుడిసె వాసుల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈరోజు వరంగల్ నగరంలో ఉన్నటువంటి జక్కలొద్ధి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సీపీఎం పార్టీలోని గుడిసెలకు సంబంధించిన రామ సురేందర్ నగర్ ప్రాంతంలో సుమారు 3వేల కుటుంబాలు ఈరోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఉదయాన్నే జక్కలొద్ది సందర్శనకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కాలనీలో ఉన్న సమస్యలన్నింటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 40గుడిసె కేంద్రాల్లో ఎమ్మెల్యే నరేందర్ రోడ్లు డ్రైనేజ్, మంచినీరు, కరెంటు మీటర్లు, ఇండ్ల పట్టాలు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాళ్లందరిని సమావేశ పరిచి జనరల్ బాడీ సమావేశం నిర్వహించి కాలనీకి కావాల్సిన సమస్యలన్నీ కూడా తెలుసుకోని పట్టాలందించారు.


ఈ సందర్భంగా ప్రజలందరూ ముక్కుమ్మడిగా సుమారు 3వేల కుటుంబాలు ఎమ్మెల్యే నరేందర్ వెంట అడుగువేస్తామని రామ సందీప్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి మిగతా సీపీఎం శాఖ కార్యదర్శులకు, నాయకులకు, మహిళా కార్యకర్తలకు, మహిళా లీడర్లు, అందరు ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఎమ్మెల్యే నరేందర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఊరికి గతంలో ఉన్నటువంటి పేరు ప్రగతి నగర్ అని పెట్టారు. కానీ ఆ ఊరికి ఎలాంటి ప్రగతి లేదు కాబట్టి అక్కడ గతంలో సీపీఎం పార్టీలో పనిచేసి గుడిసె వాసుల కోసం పేదల కోసం పనిచేసి అమరుడైనటువంటి కార్పొరేటర్ రామ సురేందర్ పేరు ఆయన జ్ఞాపకార్థంగా కాలనీకి ఎమ్మెల్యేగా నామకరణం చేయడం జరిగింది. రామ సురేందర్ నగర్ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. తమలాంటి పేదల కోసం పనిచేసినటువంటి నాయకుడిని తాము కాపాడుకుంటామని, అట్లాగే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ వెంట నడిచి నరేందర్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. వరంగల్ తూర్పులో ఎగిరేది గులాబీ జెండా అని ఊరు అభివృద్ధి చేసుకోవడం కోసం ఎమ్మెల్యే నరేందర్ ను గెలిపించుకుంటామని వాగ్దానం చేసి తీర్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, భోగి సువర్ణ సురేష్, బీఆర్ఎస్ నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, శాఖ కార్యదర్శులు లావణ్య నిమ్మల, అల్లాడి యాకయ్య, వెంకటేశ్వర్లు బూడిద, కందగట్ల రఘుపతి, కోట విజయ్, కొత్తూరు అనిల్, కొత్తూరు రాజు, మంద కిట్టు, కలకోటి శ్యామ్, పూసల రేవతి, నరేష్, రత్న, అనూష, శంకర్, మైరునిస్సా, షాహిన్, లక్ష్మణ్, మానస, పూర్ణ చెందర్, సీహెచ్ రాజు, ఓర్సు, రేణుక, స్వప్న, కోమల, ప్రవళిక, ఇమ్మడి శ్రీనివాస్, ఎండీ పాషా, జన్ను భరత్, మిట్టపెల్లి రమేష్, మొగుళ్ళ సునీల్, రెడ్డి సుమలత, ఆలనా, ఎండి షరీఫ్, బొంత సంపత్, లావణ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement