Monday, April 29, 2024

Breaking : ఇదెక్క‌డి గేమ్ రా బాబు.. ఆట‌లో పాల్గొన్న హైద‌రాబాద్ వాసి మృతి..!

మ‌నం రోజు చూస్తుంటాం.. మాల్స్ లో, ఏదైనా క్రీడా ఈవెంట్స్ లో వింత వింత గేమ్స్ మ‌న‌తో ఆడిస్తుంటారు ఆర్గ‌నైజ‌ర్లు. అయితే క‌స్ట‌మ‌ర్ల ఆనందం కోసం చిన్ని ప్ర‌య‌త్నంగా ఇలా రిసార్ట్స్ లో, మాల్స్ లో గేమ్స్ నిర్వ‌హించ‌డం స‌హ‌జ‌మే.. అయితే వికారాబాద్ జిల్లాలో మూన్ లైట్ రిసార్ట్స్ లో ఓ గేమ్ ను కండ‌క్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. బావిలో ఒక వ‌స్తువును వేస్తే.. దాన్ని మ‌నం తీసుకురావ‌డ‌మే. ఆ బావిలో దూకి వ‌స్తువును తీసుకొచ్చిన వారు ఆట‌లో విజ‌యం సాధించిన‌ట్లు. ఈ ఆట‌లో పాల్గొన్న హైద‌రాబాద్ వాసి బావిలో దూకి మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement