Thursday, May 2, 2024

WGL: సేవా తత్పరత దాతృత్వానికి నిదర్శనం ఆర్యవైశ్యులు… ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు టౌన్, జనవరి 7(ప్రభ న్యూస్): సమాజంలో సేవా తత్పరత దాతృత్వానికి నిదర్శనం ఆర్యవైశ్యులు అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చెప్పారు. 2024 సంవత్సరానికి చెందిన వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ వాసవి క్లబ్ కపుల్స్, సిల్వర్ కే సిజిఎఫ్ అన్నపూర్ణ క్లబ్, పెద్దవంగర వాసవి క్లబ్, సరస్వతి వాసవి క్లబ్, దంతాలపల్లి వాసవి క్లబ్, ఛ‌త్రపతి శివాజీ యూత్ క్లబ్‌లకు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రోత్సహిస్తూ తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమాన్ల రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా గంప సాంబమూర్తి ఈ ఐదు క్లబ్లను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement