Saturday, May 4, 2024

అనాధ పిల్లల డ‌బ్బులో అంగన్వాడీ టీచర్ చేతివాటం

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండలో ఓ అంగన్వాడీ టీచర్ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల వద్ద డబ్బులు తీసుకుంటున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయిన పసి హృదయాలను జిల్లా పరిరక్షణ విభాగం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్పాన్సర్ షిప్ నుండి విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం కోసం నెలనెలా రూ.2వేలు చెల్లిస్తుంది. అయితే రెండు మూడు నెలలకు ఓ సారి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. అయితే పిల్లల నానమ్మతో డబ్బులు విడిపించేందుకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్ ఆపన్న హస్తం అందించాల్సింది పోయి మానవత్వం మరిచిన సదరు తల్లిదండ్రులు లేని పిల్లలకు రెండు నెలలకు, నాలుగు నెలలకు ఒక్కసారి వచ్చే డబ్బుల్లో కమీషన్లు కూడా తీసుకుంటుందని పిల్లల నానమ్మ మాచర్ల శాంతమ్మ ఆరోపించింది. కమిషన్ ఇవ్వకుంటే తాను తలుచుకుంటే నీకు డబ్బులు రావు అంటూ అంగన్వాడీ బెదిరిస్తోందని మీడియాతో శాంతమ్మ గోడు వెళ్లబోసుకుంది. అనాధ పిల్లలకు వచ్చే డబ్బుల కోసం పట్టి పీడిస్తున్న సదరు అంగన్వాడీ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా అధికారులకు ఇవ్వాలంటూ :
పిల్లల నానమ్మ శాంతమ్మ కమిషన్ ప్రతి సారి ఎందుకు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ ను అడిగితే తమకు సంబంధించిన జిల్లా అధికారులకు ఇవ్వాలంటూ పట్టి పీడిస్తుందని ఆమె మీడియాతో తమ గోడును వినిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement