Thursday, April 25, 2024

నేటి సంపాద‌కీయం – షెహబాజ్‌కు కత్తిమీద సామే!

పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌ ) అధ్యక్షుడైన షెహబాజ్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు.పాక్‌లోని పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.అవిశ్వాసంలో ఓటమి పాలైన ఇమ్రాన్‌ ఖాన్‌ ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఇన్సాఫ్‌ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడమే కాకుండా ప్రధానమంత్రి ఎంపికకు దూరం గా ఉండాలని నిర్ణయించారు.దాంతో షెహబాజ్‌ ఎన్నిక సులభమైంది. షెహబాజ్‌కి ఈ తరుణంలో ప్రధాన మంత్రి పదవి షెహబాజ్‌కి ముళ్ళ కిరీటమే. పాక్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఆయన పదవీ నిర్వహణ కత్తిమీద సామువంటిదే. అయితే, ఇమ్రాన్‌ దూరం చేసుకున్న వర్గాలను కలుపుకుని పోవడం ద్వారా ఆయన తన పదవిని కొనసాగించేందు కు వీలుంది.రాజకీయ చాతుర్యమే కాకుండా అనుభవం ఉన్న దృష్ట్యా షెహబాజ్‌కి అది అసాధ్యం కాకపో వచ్చు. అంతేకాకుండా మరో మాజీ ప్రధాని బెనెజీర్‌ భుట్టో కుమారుడైన బిలావర్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ మద్దతు ఉండటం షెహబాజ్‌కి కలిసొచ్చే అంశం. మనీల్యాండరింగ్‌ కేసులో విచారణను ఎదు ర్కొంటున్న షెహబాజ్‌కీ,ఆయన కుమారునికి కోర్టులో ఊరట లభించడంతో ప్రధానమంత్రి పదవిని స్వీక రించేందుకు మార్గం సుగమమైంది.

ఆయన 2020 నుంచి రెండేళ్ళ పాటు పార్లమెంటులో ప్రతిపక్ష నాయ కునిగా వ్యవహరించారు.దేశ సమస్యలపై ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది.షెహబాజ్‌పై ఆయన అన్న షరీఫ్‌పై మాదిరిగానే అనేక ఆర్థికనేరాల కేసులున్నాయి.వాటిపై విచారణను ఆయన ఎదుర్కొం టున్నారు.అయితే, తన అన్న అనుసరించిన ఆర్థిక విధానాలనే ఆయన అనుసరిస్తున్నారు. అమెరికాతో మైత్రి కొనసాగిస్తున్నారు.నవాజ్‌ షరీఫ్‌ అమెరికాతో మైత్రి సాగించినప్పటికీ ఆంతరంగిక వ్యవహారాలో జోక్యాన్ని సహించేవారు కారు.ఇప్పుడు షెహ్‌బాజ్‌కి అదే యాసిడ్‌ టెస్ట్‌ అవుతుంది. అంతేకాకుండా సైన్యం పెత్తనం కూడాఎక్కువ కనుక, సై నికాధికారులతో సర్దుకుని పోతుండాలి. సైనికాధికా రులతో ఘర్షణ పడటం వల్లనే వారి ఒత్తిడి కారణంగానే ఇమ్రాన్‌ పదవి కోల్పోయినట్టు కథనం. అంతేకాకుం డామత పెద్దలమాటలను తు.చ తప్పకుండాఅమలు జేయా ల్సిరావడం వల్ల కూడా ఇమ్రాన్‌ పదవిలో ఇమడలేకపోయారు. ఇమ్రాన్‌ రాజకీయాల్లోకి రాక ముందు క్రికెట్‌ కెప్టెన్‌గా ఖ్యాతిని ఆర్జించడ ం వల్ల సహజమైన ఆధిక్యతను ప్రదర్శించేవారు.

అది ప్రత్యర్ధులకు కంట గింపుగా ఉండేది.ఆయన ఆర్థిక విధానాలు ప్రజలకు మేలు చేయ కపోగా దేశానికిహాని చేకూర్చాయి.అమెరికాకు ఆయనే మీ వ్యతిరేకం కాదు. అమెరికా నుంచి సాయం అందినంత కాలం ఆదేశంతో సవ్యంగానే ఉండేవారు.చైనా నుంచి ఎక్కువ రుణ సాయాన్ని పొందారు.విదేశాలకు పాక్‌ చెల్లించాల్సిన రుణాల 14.814 ట్రిలియన్‌ డాలర్లు.ఇందుకు బదులుగా ఆయన ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు.ఆక్రమిత కాశ్మీర్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నియమని బంధనలను చైనా గాలికి వదిలేసింది.ఇమ్రాన్‌ ఆర్థిక అవసరాలను అడ్డుగా పెట్టుకుని చైనా పాక్‌లో పెక్కు శాశ్వత నిర్మాణాలు చేపట్టింది.భారత్‌పై విషప్రచారాన్ని సాగించేందుకు ఇమ్రాన్‌ని చైనా ఉపయోగించుకుంది. పాక్‌లో చైనా చేపట్టిన నిర్మాణాలకు అయిన వ్యయాన్ని పాక్‌ నుంచి వసూలు చేసేందుకు చైనా శ్రీలంకలో అనుసరించిన పద్ధతినే అనుసరిస్తోంది అప్పు తీర్చకపోతే ఆయా ప్రాజెక్టులపై వచ్చే ఆదాయంలో వాటా కోరుతోంది.

ఒకరకంగా చెప్పాలంటే పాక్‌ని అమెరికా,చైనాలు పీల్చి పిప్పి చేశాయి. అమెరికా, చైనాలతో ఎంత వరకుఉండాలో తాను అంతవరకే ఉండే వాడిననీ,ఇమ్రాన్‌ ఈ రెండు దేశాలకూ సాష్టాంగం పడటం వల్ల పాక్‌ పరువు పోయిందని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య పూర్తిగా అసత్యం కాదు.ఇమ్రాన్‌ సౌదీ అరేబియాతో కూడా అతిగా వ్యవహరించారు. పాక్‌ తన పాత బకాయిల గురించి ఊసెత్తకపోవడం వల్ల తదుపరి సాయం చేయలేమని ఇమ్రాన్‌ ముఖం మీదనే సౌదీ యువరాజు స్పష్టం చేశాడు. రష్యాతో కూడా అదే మాదిరిగా అతి ధోరణిని ఇమ్రాన్‌ ప్రదర్శించారు. రష్యాతో అతి చనువును ప్రదర్శించడం వల్లనే ఆయనపై అమెరికా ఆగ్రహించిన మాట నిజమే కానీ,తనను గద్దె దించడానికి అమెరికా కుట్ర పన్నిందన్న ఇమ్రాన్‌ ఆరోపణలో నిజం లేదు. పాక్‌ సైన్యం మద్దతుతో గద్దె నెక్కిన ఇమ్రాన్‌ పదవినుంచి దిగిపోయేటప్పుుడు సైన్యంపై ఆరోపణలు చేయడం గమనార్హం.ఆయన తీసుకున్న నిర్ణయాలు,చేపట్టిన కార్యక్రమాలే ఆయన పదవికి చేటు తెచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement