Friday, April 26, 2024

జర్నలిస్ట్ డైరీ అవిష్కరించిన ఎంఎల్ఏ గండ్ర వెంక‌ట‌ రమణా రెడ్డి…

భూపాలపల్లి, : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. అనంతరం గండ్ర మాట్లాడుతూ.. మీడియా అకాడమీ ద్వారా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున అందించడం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.1లక్ష ఆర్ధిక సహాయంతో పాటు మూడేళ్ళ వరకు రూ.3వేల చొప్పున ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని తెలిపారు. ఇంకా జర్నలిస్టులకు చేయాల్సింది చాలా ఉందన్నారు. త్వరలోనే భూపాలపల్లి జిల్లాలోని జర్నలిస్టులకు విడతల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని గండ్ర హామీ ఇచ్చారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వడం జరిగిందని, అర్హులైన మిగతా వారికి కూడా నివేశన స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే గండ్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఉమ్మడి వరంగల్ జిల్లా కో-కన్వీనర్ తుడుక రాజనారాయణ, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు వంశీకృష్ణ, టెంజు జిల్లా అధ్యక్షుడు అంబాల సంపత్, జిల్లా నాయకులు సారేశ్వర్ రావు, అడ్డగట్ల శ్రీధర్, ఎర్రం సతీష్, ఎడ్ల సంతోష్, కక్కేర్ల జగన్, చెరుకు సుధాకర్, భూమిరెడ్డి, బొమ్మనబోయిన పృద్వీ, కే.రంజిత్, చేని శ్రీనివాస్, ఎం. చిరంజీవి, వినయ్, సతీష్, బండ మోహన్,మధు,రడపక రమేష్,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement