Monday, October 14, 2024

Vikarabad : రైతుల‌ సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం.. ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్

వికారాబాద్, (ప్రభ న్యూస్) : రైతాంగం బాగున్నప్పుడే సమాజం బాగుంటుంద‌ని ఆలోచించి.. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు.. రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు ..తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా వికారాబాద్ మండలం నారాయణపూర్ గొట్టుముక్కల గ్రామంలో రైతు వేదికలలో.. రైతులతో కలిసి దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఎడ్ల బండి పై పర్యటించి రైతులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా రైతుల కోసం రైతుబంధు ..రైతు భీమా లాంటి పథకాలను చేపట్టార‌న్నారు. రాబోయే రోజుల్లో రైతు రాజుగా మారతాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి ..మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి.. కౌన్సిలర్లు గోపాల్ ..వ్యవసాయ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement