Tuesday, October 15, 2024

Nizamabad : తెలంగాణ చెరువుల పండుగలో పాల్గొన్న.. ఎమ్మెల్సీ క‌విత

తెలంగాణ చెరువుల పండుగలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత..ఈ కార్య‌క్ర‌మం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ ఇంటిని తట్టిన ఏదోఒక సంక్షేమ పథకంలో లబ్ది పొందింద‌ని చెప్పారు. కాగా సంక్షేమ ప‌థ‌కాల‌పై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం , మహేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డిలకి స‌వాల్ విసిరారు. జిల్లా ఎంపి పనితీరుపై అరవింద్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, తెలంగాణ అభివృద్ధి చెరువులతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతు ..మహారాష్ట్ర కు.. తెలంగాణకు రైతుల పరిస్థితిలో వ్యత్యాసాన్ని వివరించారు. రానున్నది తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఘంటాపథంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్న విఠల్, వైస్ చైర్మన్, జడ్పీటిసి లు, ఎంపిపి లు, సర్పంచులు, ఎంపిటిసి లు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement