Monday, April 29, 2024

ఉర్సు రంగలీల మైదనాంలో పటాకుల మోత… 54 అడుగుల భారీ నరకాసుర విగ్రహం దహనం

కరీమాబాద్ ( ప్రభ న్యూస్) చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిఆని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నరక చతుర్దశినీ పురస్కరించుకొని చారిత్రాత్మక ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం రాత్రి నరకాసురవధ ఉత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నరకాసురవధ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కార్పోరేటర్ మరుపల్ల రవి కార్యవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు దీపావళి పర్వదినానికి ముందు జరిగే నరకాసుర వధ గత 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవి వెల్లడించారు 54 అడుగుల ఎత్తుగల నరకాసుర విగ్రహ ప్రతిమను రంగాలీల మైదానంలో ఏర్పాటు చేశామని రవి అన్నారు.

నరకాసురవధ కు ముందు శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణతో ఊరేగింపు రంగలీల మైదానం వరకు సాగింది. అనంతరం నరకాసుర దహన కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బాణసంచాతో అంటి పెట్టగా నరకాసుర ప్రతిమలో అమర్చిన బాణసంచా పెద్ద ఎత్తున పేలుతూ ఉండగా నరకాసురుడు ఆ మంటల్లో దహనం కాగా అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. నరకాసురవధ వివిధ రకాల టపాకాయలతో ఆకాశంలో మిరిమిట్లు గొలిపే విన్యాసాలు వివిధ రకాల టపాసులు లు ఆబాలగోపాలాన్ని వేడుకలను వీక్షించేందుకు వచ్చిన వారిని ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. నరకాసురవధ వేడుకల్లో అతిథులుగా కూడా చైర్మన్ మరి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు పల్లం పద్మ రవి, గుండు చందన,అరుణ సుధాకర్ సిద్ధం రాజు, కుడా చైర్మన్ ప్రవీణ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్యామల్రావు, కోశాధికారి కనుకుంట్ల రవి, ఉపాధ్యక్షులుమధు సహాయ కార్యదర్శి రామ్మూర్తి, సభ్యులు కుమార్ గౌతమ్ ,కుమారస్వామి శివ ,రంజిత్, రాజు నరసింహ, శివ సాయి అఖిల్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement