Wednesday, November 29, 2023

TSRTC ఆధ్వ‌ర్యంలో బిఎస్సీ న‌ర్సింగ్ క‌ళాశాల – అడ్మిష‌న్ ల‌కు ఆహ్వానం..

హైద‌రాబాద్ – టిఎస్ ఆర్టీసీ ఈ ఏడాది నుంచి న‌ర్సింగ్ క‌ళాశాల ను నిర్వ‌హించ‌నుంది.. బిఎస్ న‌ర్సింగ్ కోర్సు ను తార్నాక TSRTC నర్సింగ్ కళాశాలలో బోధించ‌నున్నారు.. కాగా, 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్ మెంట్ కోటాలో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు నేటి నుంచి చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీసీ ఎండి స‌జ్జ‌న్నార్ కోరారు.. నాలుగేళ్ళ కోర్సులో చేరడానికి ఇంటర్ బైపీసీ ఉతీర్ణులైన 17 ఏళ్లు నిండిన విద్యార్థినులు అర్హులు. ఆసక్తిగల విద్యార్థినులు ప్రవేశాలకు 9491275513, 7995165624 ఫోన్ నంబర్లను సంప్రదించవ‌చ్చు.. ఈ కళాశాల‌లో బాలిక‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement