Wednesday, May 15, 2024

TS | మారనున్న ట్రాఫిక్ రూల్స్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ కొత్తకోట

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో రేవంత్ సర్కార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ రూల్స్ మార్చేందుకు కూడా వెనుకాడవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా, హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై హైద‌రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవ్వాల (శనివారం) సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి నిరంతర ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై పార్కింగ్‌ను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్‌ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టమ‌ని తెలిపారు. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతుందని.. నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి రావాలని సూచించారు. ఇతర సమయాల్లో వస్తే చలాన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్‌పై కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని.. హైదరాబాద్ ట్రాఫిక్ లెస్ సిటీగా మారుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement